From: babasatsang@googlegroups.com
Date: Fri, 03 Feb 2012 21:33:23 +0000
Subject: [Baba-Satsang] Digest for babasatsang@googlegroups.com - 1
Message in 1 Topic
To: Digest Recipients <babasatsang@googlegroups.com>
=============================================================================
Today's Topic Summary
=============================================================================
Group: babasatsang@googlegroups.com
Url: http://groups.google.com/group/babasatsang/topics
- హాస్యము + బోధ (Humor + Teaching) [1 Update]
http://groups.google.com/group/babasatsang/t/ce6b690fcb66f220
=============================================================================
Topic: హాస్యము + బోధ (Humor + Teaching)
Url: http://groups.google.com/group/babasatsang/t/ce6b690fcb66f220
=============================================================================
---------- 1 of 1 ----------
From: Subrahmanyam Gorthi <subrahmanyam.gorthi@gmail.com>
Date: Feb 02 10:24PM +0100
Url: http://groups.google.com/group/babasatsang/msg/3d85185b0ef39c1d
[image: saibaba2.jpg]
శిరిడీలో ప్రతీ ఆదివారమూ సంత జరిగేది. చుట్టుప్రక్కల పల్లెల నుండి ప్రజలు
వచ్చి వీధులలో దుకాణములు వేసుకుని సరుకులు అమ్ముతూ ఉండేవారు. ప్రతిరోజు
మద్యాహ్నము 12 గంటలకు మసీదు భక్తులతో నిండిపోయేది. ముఖ్యముగా ఆదివారమునాడు
క్రిక్కిరిసి ఉండేది. ఒక ఆదివారమునాడు హేమాద్‌పంతు సాయిబాబా ముందు కూర్చుని
బాబా పాదములొత్తుచూ మనస్సునందు జపము చేసుకొనుచుండెను. బాబాకు ఎడమవైపున శ్యామా,
కుడివైపున వామనరావు ఉండిరి. శ్రీమాన్ బూటీ, కాకా సాహెబుదీక్షిత్
మొదలగువారుకూడా నుండిరి. శ్యామా నవ్వుచూ అన్నాసాహెబ్‌తో (హేమాద్‌పంతుతో), "నీ
కోటుకు శనగగింజలు అంటినట్లున్నవి చూడుము" అనెను. అట్లనుచు హేమాద్‌పంతు చొక్కా
చేతులను తట్టగా, శనగ గింజలు నేలరాలెను. హేమాద్‌పంతు తన చొక్కా ఎడమచేతి
ముందుభాగమును చాచెను. అందరికీ ఆశ్చర్యము కలుగునట్లు కొన్ని శనగ గింజలు
క్రిందికి దొర్లుట ప్రారంభించెను. అక్కడున్నవారు వానిని ఏరుకొనిరి.
ఈ సంఘటన హాస్యమునకు తావిచ్చెను. అక్కడున్న వారందరు ఆశ్చర్యపడిరి. ఎవరికి
తోచినట్లు వారు శనగలు చొక్కాచేతిలో నెట్లు ప్రవేశించి యుండునో
ఊహింపనారంభించిరి. శనగలు చొక్కాలో నెట్లు దూరి యచట నిలిచినవో హేమాద్‌పంతు కూడా
గ్రహించలేకుండెను. ఎవ్వరికి సరియైన సమాధానము తోచక జవాబు నివ్వనపుడు అందరునూ ఈ
అద్భుతమునకు ఆశ్చర్యపడుచుండగా, బాబా, "వీనికి (అన్నాసాహెబుకు) తానొక్కడే తిను
దుర్గుణ మొకటి గలదు. ఈనాడు సంతరోజు; శనగలు తినుచూ ఇక్కడకు వచ్చినాడు. వాని
స్వభావము నాకు తెలియును. ఈ శనగలే దానికి నిదర్శనము. ఈ విషయములో ఏమి
ఆశ్చర్యమున్నది?" అనిరి.
హేమాద్‌పంతు - "బాబా, నేనెప్పుడూ ఒంటరిగా తిని యెరుగను. అయితే, ఈ దుర్గుణమును
నాపై ఏల మోపెదవు? ఈనాటికి ఎన్నడునూ శిరిడీలోని సంత నేను చూచి యుండలేదు. ఈరోజు
కూడా సంతకు పోలేదు. అట్లయినచో నేను శనగలను ఎలా కొనగలను? నేను కొననప్పుడు
నేనెలా తినగలను? నా దగ్గర ఉన్నవారికి పెట్టకుండా నేను ఎప్పుడూ ఏమియూ తిని
యెరుగను."
బాబా - "అవును అది నిజమే. దగ్గరున్న వారికి ఇచ్చెదవు. ఎవరునూ దగ్గర లేనపుడు
నీవుగానీ, నేనుగానీ ఏమి చేయగలము? కానీ, నీవు తినుటకు ముందు నన్ను స్మరింతువా?
నేనెల్లప్పుడు నీ చెంత లేనా? నీవేదైనా తినుటకు ముందు నాకు అర్పించుచున్నావా?"
*ఈ లీలనుండి నేర్చుకోవలిసిన బోధ (శ్రీ హేమాద్‌పంతుగారు వివరించినది)*:
మనము గురువుని స్మరించనిదే ఏ వస్తువును మన మనస్సు మరియు మన ఇంద్రియములతో
అనుభవించరాదు. మనస్సునకు ఈ విధముగా శిక్షణను ఇచ్చినచో మనము ఎల్లప్పుడునూ
బాబాను జ్ఞప్తియందు ఉంచుకొనగలము. బాబా ధ్యానము ఎన్నో రెట్లు వృధ్ధి పొందును.
బాబా సగుణ స్వరూపము మన కండ్ల ఎదుట నిలుచును. మన మనస్సునందు బాబాను ఎప్పుడైతే
నిలుపగలమో, అప్పుడు ప్రపంచ సుఖములందుగల అభిలాష క్రమముగా నశించి, మన మనస్సులు
శాంతిని, ఆనందమును పొందును.
In Shirdi, bazar was held every Sunday, and people from the neighbouring
villages came there, erected booths and stalls on the street, and sold
their wares and commodities. Every noon, the Masjid was crowded more or
less; but on Sunday, it was crowded to suffocation. On one such Sunday,
Hemadpant sat in front of Baba, massaging His Legs and muttering God's
name. Shama was on Baba's left, Vamanrao to His right - Shriman Booty and
Kakasaheb Dixit and others were also present there. Then Shama laughed and
said to Annasaheb - "See that some grains seem to have stuck to the sleeve
of your coat". So saying he touched the sleeve and found that there were
some grains. Hemadpant straightened his left fore-arm to see what the
matter was, when to the the surprise of all, some grains of gram come
rolling down and were picked up by the people who were sitting there.
This incident furnished a subject-matter for joke. Everybody present began
to wonder and said something or other as to how the grains found their way
into the sleeve of the coat and lodged there so long. Hemadpant also could
not guess how they found an entrance and stayed there. When nobody could
give any satisfactory explanation in this matter, and everybody was
wondering about this mystery, Baba said as follows :-
Baba - "This fellow (Annasaheb) has got the bad habit of eating
alone.Today is a bazar-day and he was here chewing grams. I know his
habit and
these grams are a proof of it. What wonder is there is this matter?"
Hemadpant - "Baba, I never know of eating things alone; then why do you
thrust this bad habit on me? I have never yet seen Shirdi bazar. I never
went to the bazar today, then how could I buy grams, and how could I eat
them if I had not bought them? I never eat anything unless I share it with
others present near me".
Baba - "It is true that you give to the persons present; but if none be
near-by, what could you or I do But do you remember Me before eating? Am I
not always with you? Then do you offer Me anything before you eat?"
*Teaching from the Leela (explained by Sri Hemadpant)*:
We should not enjoy any object with our mind and senses without first
remembering our Guru. When the mind is trained in this way, we will be
always reminded of Baba, and our meditation on Baba will grow apace. The
Saguna-form of Baba will ever be before our eyes. When Baba's Form is thus
fixed before our mind, the attachment to worldly pleasures will gradually
disappear and our mind shall attain peace and happiness.
Sources:
http://www.shrisaibabasansthan.org/shri%20saisatcharitra/english/saich24_a.html
http://www.shrisaibabasansthan.org/shri%20saisatcharitra/telugu/main_telugu.html
<http://www.shrisaibabasansthan.org/shri%20saisatcharitra/telugu/telugu/telgusaicharitra/adhyay-24.pdf>
2012/1/25 Subrahmanyam Gorthi <subrahmanyam.gorthi@gmail.com>
--
You received this message because you are subscribed to the Google
Groups "Baba-Satsang" group.
To post to this group, send email to babasatsang@googlegroups.com.
To unsubscribe from this group, send email to
babasatsang+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/babasatsang?hl=en.
--
Blissformula, PSN:13/ATAMPA(All Types Adequate Meditating
Personalities Assembling). Website:
http://sites.google.com/site/autoverflownow/free-globaltel